రాత్రి నుంచి ప్రశ్నల వర్షం

REVANTH REDDY
REVANTH REDDY

రేవంత్‌ ఇంట్లో కొనసాగుతున్న దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు,
మనీల్యాండరింగ్‌, ఫెమా నిబంధనలు ఉల్లంఘన కేసులు
విదేశీ బ్యాంకుల నుంచి రూ.9 కోట్ల లావాదేవీలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అక్రమాస్తులపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయడంతోపాటు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు అభియోగపత్రాలను కూడాఅందించారు.ఎన్నికల వాతావరణంలో జరిగిన ఈ దాడులు సంచలనం సృష్టించింది. ఐటి శాఖతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరె క్టరేట్‌ అధికారులు సోదాలునిర్వహించారు. దేశ, విదే శాల్లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపి రేవంత్‌ అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రాథమిక విచార ణలో తేలిన తర్వాతనే ఆదాయపన్ను శాఖాధికారులు పక్కా వ్యూహంతో, ప్రణాళికా బద్ధంగా దాడులకు పూనుకున్నట్లుగా చెబుతున్నారు. కాగా ఫెరా నిబంధ నలను ఉల్లంఘింయడంతోపాటు మనీ ల్యాండరింగ్‌- హవాలా కేసుల్లోనూరేవంత్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ప్రివెన్ష్‌న్‌ ఆఫ్‌కరప్సన్‌, బ్లాక్‌మనీ-ఆదాయ పన్ను చట్టంతోపాటు మనీ ల్యాండరింగ్‌ చట్టం,ఇతర చట్టాల కింద రేవంత్‌పై కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి. రేవంత్‌ ఇళ్లతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో, మొత్తం 15 చోట్లఆదాయం పన్నుశాఖ 14 బృందాలు గురువారంఉదయందాడులుప్రారంభించి, సాయంత్రం వరకు దాడులు కొనసాగడంతో అనేక డ్యాక్యుమెం ట్లను వారికి లభించగా వాటిని స్వాధీనం చేసుకు న్నారు. ఇసిఐఆర్‌ రిపోర్టును రూపొందించిన ఇడి తదుపరిచర్యలు తీసుకోనుంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత ఇటీవలే ఆయనకు పార్టీపరంగా ఉన్నత పదవి లభించిన తర్వాత జరుగుతున్న ఈ చర్యలు తీసుకోవడంతో రేవంత్‌ లక్ష్యంగా రాజకీయ దాడులు జరుగుతున్నాయని, పాతకేసులను తిరగ దోడుతున్నారని మహాకూటమి నేతలు ఆరోపించగా, చట్టం తనపని తాను చేస్తున్నదని టిఆర్‌ఎస్‌తోపాటు బిజెపి నేతలు తెలిపారు. అయితే న్యాయవాది రామారావు నేరుగాఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)కి ఫిర్యాదుచేయడంతో ఈదాడులు జరిగాయి. జూబ్లి హిల్స్‌లోని రేవంత్‌నివాసంతోపాటువివిధ ప్రాంతాల్లో ఐటి అధికారులు ఏకకాలంలోదాడిచేశారు.