రాజ‌మండ్రిలో ఫైనాన్షియ‌ర్ దారుణ హ‌త్య‌

murder
murder

రాజమండ్రి గోకవరం మండలం తిరుమలాయపాలెంలో ఫైనాన్షియర్‌ పోతంశెట్టి విష్ణు ఈశ్వర్లు అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం సాయంత్రం ఆయన హత్యకు గురైనట్లు నిర్దారణ అయింది. విష్ణు ఈశ్వర్లును.. షేక్‌ వలీ సాహెబ్‌ అనే వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. విష్ణు దగ్గర షేక్‌ వలీ సాహెబ్‌ కొంత నగదును అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని అడగటంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. విష్ణు ఈశ్వర్లును హత్య చేసి ఎవరికీ తెలియకుండా నిందితుడు సెప్టిక్‌ట్యాంకులో పడేశాడు. కాగా విష్ణు ఈశ్వర్లు స్వస్థలం పెద్దాపురం మండలం గుడివాడ అని తెలిసింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.