రాజ‌న్న దేవాల‌యానికి భ‌క్తుల తాకిడి

vemulawada temple
vemulawada temple

వేముల‌వాడః రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. నూతన సంవత్సరం తొలిరోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలాచరించి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం క్యూలెన్లలో వేచిచూసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి సుమారు 3గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.