“రాజ‌కీయ వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు”

K SIVA, KTR, MAHESH
K SIVA, KTR, MAHESH

హైద‌రాబాద్ః మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను చిత్రానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇటీవ‌ల ఈ సినిమాను వీక్షించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. హీరో మహేష్‌బాబు, దర్శకుడు కొరటాలశివను ప్రత్యేకంగా అభినందించారు. తన మిత్రుడు మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివతో నిర్వహించిన స్నేహపూర్వక సమావేశంలో భరత్ అనే నేను సినిమాతో పాటు ప్రజాజీవితాన్ని గురించి కేటీఆర్ చ‌ర్చించారు. భరత్ అనే నేను చిత్రాన్ని వీక్షించిన కేటీఆర్‌కు మహేష్‌బాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.