రాజ్‌భవన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుం చి మూడు గంటల వరకు రాజ్‌భవన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సిఎం కెసిఆర్ సహా పలువురు మంత్రులు మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సోమాజిగూడ చౌరస్తా వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వరకు, ఇక్కడి నుంచి పంజగుట్ట సర్కిల్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని ఆయన తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సోమా జిగూడ చౌరస్తా వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వరకు కొంతసేపు రహదారిని మూసివేస్తామని ఆయన తెలిపారు. కాగా రాజ్‌భవన్‌కు వచ్చే విఐపిలు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపిలు, తాజాగా గెలుపొందిన ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సిలు మూడవ నంబర్ గేట్ వద్ద తమ వాహ నాలను నిలపాల్సి వుంటుంది. మీడియా వాహనాలను దిల్కుషా గెస్ట్‌హౌస్ వద్ద, ఇతర విఐపిలు, సర్కారు అధికారుల వాహనాలను ఎంఎంటిఎస్ పార్కింగ్ కేంద్రంలో, నాసర్ పాఠశాల, లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద నిలపాల్సి వుంటుంది. ఈ మార్గంలో గురువారం మధ్యాహ్నం ప్రయాణిం చే వాహనదారులు ముందుగానే తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అనిల్ కుమార్ కోరారు.