రాజ్య పరివేష్టిత కుడ్యాలు

ROME
ROME

రాజ్య పరివేష్టిత కుడ్యాలు

లండన్‌ నగరంలో ఉండే అతిముఖ్యమైన చారిత్రక కట్టడాలలో, రెండు వేలయేండ్లకు ముందు రోమన్‌ చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన ‘లండన్‌వాల్‌ అని పిలువబడే గోడ అవశేషాలు ప్రధానమైంది. పూర్వ కాలంలో ఈ గోడ నగరం చుట్టూ రక్షణ కోసం నిర్మించబడింది. కాని ప్రస్తుతం రెండు మూడు చోట్ల మాత్రమే మచ్చుకు మిగిలింది. చారి త్రక ప్రాధాన్యత గలిగిన ఈ ‘లండన్‌వాల్‌ ప్రభుత్వంచే పరిరక్షిం చబడు మాన్యుమెంటుగా గుర్తింపు పొందింది. ఇంగ్లండు దేశాన్ని రోమన్‌ చక్రవర్తులు క్రీ.శ.43లో ఆక్రమించుకొని దాదాపు నాలుగు వందల సంవత్సరాలు పాలించారు. లండన్‌ నగ రాన్ని నిర్మించినదిగూడ రోమనులే. దానికి వారు ‘లండనేరియం అని నామకరణం చేశారు. ఈ నగరాన్ని శతృబారి నుండి రక్షించడానికై నగ రం చుట్టూ క్రీ.శ.200 సంవత్సరం ప్రాంతంలో బలమైన గోడను నిర్మిం చారు.

సుమారు 350ఎకరాల విస్తీ ర్ణంలోని అప్పటి లండన్‌ చుట్టూదాదాపు 5కి.మీ. పొడవుగల గోడ నిర్మించబడింది. 20అడుగు ల ఎత్తుతో 6అడుగుల మందంతో చాలాబలంగా ఈగోడ కట్టబడింది. కోటగోడలాంటి ఈగోడపై ప్రతి 70గజాలకొక బురుజుగూడా ఉండేది. తూర్పు భాగంలో మాత్రమే అట్టి బురుజులు 22 ఉన్నట్లు తెలుస్తుం ది. ఈ గోడ నిర్మాణానికి ఉపయోగించిన దాదాపు 85వేల టన్నుల రాయి, కెంట్‌ప్రాంతం నుండి థేమ్స్‌నది మూలంగా తరలించబడింది. గోడ రాళ్ళను అతకడానికి వాటి మధ్య ఉపయోగించిన సిమెంటు లాంటి పదార్థాన్ని గురించి ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అంతుదొరకని విష యం. రెండువేల సంవత్సరాలైనా ఈ గోడ ఎంతో ధృడంగా ఉండడం విశేషం.

నగర గోడకు వెలుపల ఒక అగడ్తగూడ ఉండేదట. కాని ఇది 16వ శతాబ్దంలోనే పూడ్చివేశారు. నగరంలో చనిపోయిన కుక్కలను, ఇతర పెంపుడు జంతువుల్ని ఇందులో వేయడంచే దుర్గంధభరితమైన కారణంగా ఈ అగడ్తను పూడ్చారు. క్రీ.శ.457సంవత్సరంలో సాక్సన్‌లదండయాత్ర సమయంలో లండన్‌ వాసులు ఈ గోడమూలంగా రక్షించుకోగలిగారు. దాదాపు వేయి సంవ త్సరాలు లండన్‌ నగరానికి, నగరవాసుల రక్షణకు ఈ గోడ మిక్కిలి ఉపయోగపడింది.బయట గల రహదారులను కలపడానికి లండన్‌ గోడకు అన్నివైపులా అనేక గేట్లు ఉండేవి. సెంట్రల్‌ లండన్‌లో ప్రస్తుతం గల లడ్‌గేట్‌, బిషప్‌గేట్‌, ఆల్డ్‌గేట్‌, మూర్‌గేట్‌ ప్రాంతాలన్నీ పూర్వపు గోడకున్న గేట్ల మూలంగా వచ్చిన పేర్లే. తుపాకులు, నల్లమందు వాడకంలోకి వచ్చినందున 18, 19 శతాబ్దాల నాటికి లండన్‌ గోడ పూర్వపు ఉపయోగం కోల్పోయింది.

నగరంగూడ బాగా విస్తరించిన కారణంగా ఇది నిరుపయోగమైంది. అనేకచోట్ల దీన్ని నిర్మూలించారు. కొన్ని ప్రాంతాలలో ఈ గోడను తొలగించి దాని రాళ్ల ను ఉపయోగించి క్రొత్త కట్టడాలు నిర్మించుకొన్నారు. క్రమేణ ఈ రోమన్‌గోడ అదృశ్యమైంది. కాని నగరంలో మూడు నాలు గు చోట్ల ఇది ఇప్పటికీ గోచరిస్తుంది. రెండో ప్రపంచయుద్ద సమ యంలో 1940సంవత్సరం డిసెంబరు 29వతేది జర్మన్‌లు లండన్‌పై బాంబులు విసిరిన సమయంలో కొన్ని కట్టడాలతో బాటు నోబుల్‌ వీధి లోని గోడ పూర్తిగా నేలమట్టమయింది. టవర్‌ హిల్‌ అనే మెట్రో రైలుస్టేషన్‌కు దగ్గర మాత్రం లండన్‌గోడ చెక్కుచెదరకుండా ఉంది.లండన్‌ నగర నిర్మాణంతోబాటే ఏర్పాటయిన లండన్‌వాల్‌ అవశే షాలు ఆ దేశ చరిత్రకు మూగపోయిన సాక్షిగా, ధృఢంగా నిలిచి ఉంది.