రాజ్యసభ సోమవారానికి వాయిదా

Rajya sabha
Rajya sabha

న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. మధ్యాహ్నాం సభ ప్రారంభమైన అనంతరం టిడిపి సభ్యుడు వై సుజనాచౌదరి మాట్లాడుతూ తాము మంత్రిపదవులకు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఏపి ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారు. కేంద్రం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. దీనిపై బిజెపి సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొద్దీసేపు గందరగోళం తరువాత వై.సుజనాచౌదరి తన ప్రసంగం ముగించారు అనంతరం ప్రతిపక్షసభ్యులు ఫ్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. దీనితో సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ ప్రకటించారు.