రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఖరారు

TDP
TDP

ఏపి టిడిపి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌ పేర్లను ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసకుంది. కాగా, రాజ్యసభకు ఎంపికైన వారిలో సీఎం రమేష్‌తో సహా వర్ల రామయ్య పేరు కూడా మొదట్లో వినపడింది. ఐతే, చివరి నిమిషం వరకు రేస్‌లో ఉన్న వర్ల రామయ్యకు అవకాశం దక్కకపోగా, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అవకాశం లభించడం గమనార్హం. రాజ్యసభలో రెండు స్థానాలను ఓసిలకే కేటాయించినట్లు, సీఎం చంద్రబాబు సహాజశైలికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని టిడిపి వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.