రాజ్యసభకు ఆరుగురు పెద్దలు

KOLLAM
సుబ్రహ్మణ్యస్వామి, నరేంద్ర జాదవ్‌, సురేశ్‌ గోపి, సిద్దూ, మేరీ కోమ్‌ను నామినేట్‌ చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ : వివిధ రంగాలలో విశిష్ట ప్రతిభ కనబ రిచిన ఆరుగురిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేశారు. గతంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో పనిచేసిన జాతీయ సలహా మండలి (ఎన్‌ఎసి) సభ్యుడిగా వ్యవహరించిన నరేంద్ర జాదవ్‌ ఈ ఆరుగురిలో ఉన్నారు. మలయాళ నటుడు సురేశ్‌ గోపి, బిజెపి నాయకుడు, గాంధీ-నెహ్రూ కుటుంబానికి బద్ద వ్యతిరేకి సుబ్రహ్మణ్య స్వామి, జర్నలిస్టు స్వపన్‌దాస్‌గుప్తా, బాక్సర్‌ మేరీ కోమ్‌, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు రాజ్యసభకు నామి నేట్‌ అయిన మిగిలిన ఐదుగురు. అయితే ఇందుకు సంబం ధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.

MARYKOM_

కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు రాష్ట్రపతి వీరి పేర్లను ఖరారు చేశారు. సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాలు, క్రీడలు, కళలు, సామాజికసేవలు తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని ఎంపిక చేసి రాజ్యసభకు నామినేట్‌ చేయడం పరిపాటి. జాదవ్‌ ఎన్‌ఎసి సభ్యుడిగానే కాకుండా పలు హోదాలలో పనిచేశారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందిన సుబ్రహ్మణ్య స్వామి ఇటీవలే బిజెపిలో చేరారు. మాజీ క్రికెటర్‌ సిద్ధూ ఇప్పటికే రెండు సార్లు లోక్‌సభ సభ్యులుగా వ్యవహరించారు. స్వపన్‌దాస్‌ గుప్తా సీనియర్‌ జర్నలిస్టు. స్టేట్స్‌మన్‌, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియా టూడే లాంటి పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. మలయాళ నటుడు సురేశ్‌గోపీ కొద్దిరోజులుగా బిజెపికి దగ్గరగా ఉంటున్నారు. ఇక మణిపూర్‌కు చెందిన 33 ఏళ్ల మేరీ కోమ్‌ ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ అమెచ్యూర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ను గెలుచుకున్నారు.

SUBRAMANYAM SWAMY