రాజుగారిగది సీక్వెల్లో నాగార్జున!

NAGAR
Akkineni Nagarjuna

రాజుగారిగది సీక్వెల్లో నాగార్జున!

బుల్లితెరపై ఆట, ఆట జూనియర్స్‌ డాన్స్‌ షో తో పాపులర్‌ టీవీ యాంకర్‌గా ప్రచారంలోకి వచ్చిన ఓంకార్‌ తరువాత దర్శకుడిగా పరిచయం అయ్యి ‘రాజుగారిగది సినిమాతో తన మల్టీటాలెంట్‌ను నిరూపించుకున్నాడు. ఈ హర్రర్‌ సినిమా ప్రేక్షకాదరణ పొందటంతో పాటు మంచి వసూళ్లను సాధించి హిట్‌ చిత్రాల లిస్ట్‌లో నిలిచింది. ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘రాజుగారిగది 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలకమైన రోల్‌లో అక్కినేని నాగార్జున నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకు మొదట్లో వెంకటేష్‌ నటిస్తారని అనుకన్నప్పటికీ ‘నాగ్‌ నే ఫైనల్‌ చేశారు చిత్ర యూనిట్‌. నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఆత్మరూపంలో వచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. ‘రాజుగారిగది2 సినిమాలో నాగార్జున పాత్ర ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది.