రాజీవ్‌ గాంధీ జ‌యంతి వేడుక‌లు

SONIA GANDHI
SONIA GANDHI

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 74వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వీర్‌భూమి వ‌ద్ద‌ రాజీవ్‌ జయంతి వేడుకల సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను మోది గుర్తు చేసుకున్నారు. రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించారు మోది. రాజీవ్‌ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని మోదీ ట్వీట్‌ చేశారు. రాజీవ్‌ సమాధి వద్ద కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రియాంక, రాబర్ట్‌ వాధ్రాతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.