రాజీనామా తిర‌స్క‌ర‌ణ‌

RAVINDER REDDY, NIA JUDGE
RAVINDER REDDY, NIA JUDGE

హైద‌రాబాద్ః మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఇటీవల తీర్పు చెప్పిన హైదరాబాద్‌ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి, 4వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కె.రవీందర్‌ రెడ్డి రాజీనామాను ఉమ్మడి హైకోర్టు తిరస్కరించింది. తాత్కాలిక సెలవు ముగించుకుని తక్షణమే విధులకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయన్ని ఆదేశించింది. 2007లో జరిగిన మక్కా మసీదు పేలుళ్ల కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి రవీందర్‌ రెడ్డి తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.