రాజీనామా చేయాలంటే దమ్ముండాలిః జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురంః టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గతంలో రాజీనామా చేస్తా అని ప్రకటించి, మళ్లీ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ రోజు దీనిపై మీడియా ప్రశ్నించగా రాజకీయాల్లో రాజీనామా చేయాలంటే దమ్ము ఉండాలని, అందరూ రాజీనామా చేస్తానంటే ఎలా? అని ఎదురు ప్రశ్న వేశారు. తన డిమాండ్ల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని, సమస్యలకు పరిష్కారం చూపారని అన్నారు. అనంతపురంలో అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు.