రాజీనామాలకే కట్టుబడ్డాం

రాజీనామాలకే కట్టుబడ్డాం
ఒంగోలు: ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపి ఎంపిలు చేసిన రాజీనామా లను లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ బుధ వారం ఆమోదించినట్లు ఒంగోలు ఎంపి వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 6న లోక్‌సభ బడ్జెట్ మలివిడత సమావేశాల చివరి రోజు తామ సమర్పించిన రాజీనామాలపై బుధవారం లోక్‌సభ స్పీకర్‌ను గత నెల 29 తరువాత మరోసారి సమావేశమై చర్చించిన అనం తరం స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు మరో సారి పత్రాలు సమర్పించాలని స్పీకర్ కోరారని ఆ మేరకు రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పీకర్‌కు తమ పత్రాలు చేరిన వెంటనే తమ రాజీనామాలు ఆమోదం లభిస్తుందని వైవి ప్రకటించారు. తనతోపాటుప్రత్యేకహోదా సాధన కోసం నెల్లూరు ,తిరుపతి, రాజంపేట, కడప పార్లమెంట్‌సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, వైయస్ అవినాష్‌రెడ్డిలు తమ ఎంపి పదవులకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని తెలిపారు