రాజా డీలక్స్ సెట్స్‌ నుండి లీకైన ప్రభాస్ ఫోటో..!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్..తన ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మూడు , నాల్గు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. వాటిలో మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ ఒకటి. వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న మారుతీ..ఫస్ట్ టైం పెద్ద హీరో తో అది కూడా పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తుండడం తో అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. రీసెంట్ గా షూటింగ్ మొదలవ్వాగా..తాజాగా సినిమా సెట్స్ లోని పిక్స్ బయటకు వచ్చాయి.

లీకైన ఫోటోలో ప్రభాస్‌ , మారుతి పక్క పక్కనే కూర్చున్నారు. ప్రభాస్‌ లుక్‌ కూడా కొత్తగా ఉంది. ఈ ఫోటోతో డార్లింగ్‌ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. వింటేజ్‌ ప్రభాస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డిలక్స్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టు తిరిగే తాతా-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందట. తాతగా బాలీవుడ్‌ యాక్టర్‌ సంజయ్‌దత్‌ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తో పాటు ప్రభాస్ ఆదిపురుష్ , ప్రాజెక్ట్ కే, సలార్ మూవీస్ చేస్తున్నాడు.