రాజస్థాన్‌ సీఎంగా అశోక్‌గెహ్లట్‌

ashok gehlot
ashok gehlot

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా మాజీ సీఎం అశోక్‌గెహ్లట్‌పేరు ఖరారుఅయింది. ముచ్చటగా మూడోసారి పశ్చిమరాష్ట్రానికి గెహ్లట్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సీనియర్‌ నాయకులు, గెహ్లట్‌తో పాటు జరిపిన విస్తృత చర్చలు అనంతరం గెహ్లట్‌పేరును ఖరారుచేసారు. రాజస్థాన్‌ చీఫ్‌సచిన్‌పైలట్‌ కూడా ముఖ్యమంత్రిపోస్టుకు గట్టిపోటీపడుతున్నారు. గెహ్లట్‌ ఈసారి పదవీబాధ్యతలతో మూడోసారి సీఎంగా రాజస్థాన్‌కు పగ్గాలుచేపడుతున్నట్లు తేలింది. రాహుల్‌ గాంధీ సచిన్‌పైలట్‌తో కూడా వేరువేరు సమావేశాలు నిర్వహించారు. జైపూర్‌లోనే ముఖ్యమంత్రిఅభ్యర్ధిని ప్రకటిస్తారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లాంఛనంగా సమావేశం అయిన అనంతరం ఆ సమావేశంలోనే గెహ్లట్‌పేరును ప్రకటిస్తారని పార్టీవర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఎన్నికైన ఎమ్మెల్యేలనుంచి రాహుల్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిపై వారివారి అభిప్రాయాలను సేకరించారు. అంతేకాకుండా రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లకు డిప్యూటి సీఎం పోస్టులను కూడా ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పార్టీనేతలతో సమగ్ర చర్చలుకూడాసాగుతున్నాయి.