రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం!

earth quake in rajastan
earth quake in rajastan

జోధ్‌పూర్‌: రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో శనివారం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం, అస్తినష్టం కానీ జరిగినట్లు సమాచారం అందలేదు. అలాగే జోథ్‌పూర్‌తో పాటు నాగౌర్‌, అజ్మీర్‌, పాలి సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. మరోవైపు రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైంది.