రాజస్థాన్‌లో రైతుల ఆందోళన

Farmers
Farmers

జైపూర్‌: రాజస్థాన్‌లో రైతులు ఆందోళన బాట పట్టారు. సవరించిన భూ సేకరణ చట్టం కింద తమ భూముల తమ భూమలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జైపూర్‌ శివారు గ్రామాలకు చెందిన రైతులు తమ డిమాండ్‌ నెరవేర్చాలని కోరుతూ రెండు రోజులుగా ‘జమీన్‌ సమాధి (మెడ లోతు గోతిలో పూడ్చుకుని నిరసన వ్యక్తం చేయడం) నిర్వహిస్తున్నారు. ఐదుగురు రైతులలో ఒకరి ఆరోగ్యం క్షీణించింది. అయినా నిందార్‌ గ్రామంలో జరుగుతున్న నిరసనను విరమించేందుకు నిరాకరించాడు. 2011 జనవరిలో ప్రభుత్వం హౌసింగ్‌ ప్రాజెక్టు కింద 10 వేల ఇళ్ళను నిర్మించి ఇస్తామని ప్రకటించింది. దీని కోసం భూ సేకరణను ప్రారంభించింది. అయితే బ్రిటిషు కాలం నాటి భూ సేకరణ చట్టం కింద కాకుండా కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో సవరించిన భూ సేకరణ చట్టం కింద తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. హౌసింగ్‌ ప్రాజెక్టు కోసం జైపూర్‌ డెవలప్‌మెంట్‌ అధార్టీ (జెడిఎ) భూములను సేకరిస్తున్నది. నిరసన కారులలో ఒకరి ఆరోగ్యం ఇప్పటికే క్షీణించిందని ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న నిందార్‌ బచావోయు కిసాన్‌ సంఘర్ష్‌్‌ సమితి నాయకుడు నాగేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/