రాజస్థాన్‌లో కొత్త కేబినెట్‌ విస్తరణ

new cabinet oath at rajastan
new cabinet oath at rajastan

జైపూర్‌: రాజస్థాన్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 22 మంది కాంగ్రెస్‌, ఒక ఆర్‌ఎల్డీ శాసన సభ్యుడు సహా మొత్తం 23 మంది ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో, 13 మంది క్యాబినెట్‌ ర్యాంకు మంత్రులు కాగా మిగతా పది మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణం చేశారు. కాగా అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలెట్‌లు ఈ నెల 17న ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల ఎంపికలో వీరిద్దరూ ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీతో ,ఇతర ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. చర్చల తర్వాత వీరు జైపూర్‌కు తిరిగి వచ్చారు. కేబినెట్‌లో 30 మంది మంత్రులకు అవకాశం ఉంది , ఇంకా ఖాళీలు ఉండడంతో మళ్లీ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది.