రాజస్థాన్‌దే ఈ ఏడాది ఐపిఎల్‌ టైటిల్‌ : బిన్నీ

IPL TITLE
రాజస్థాన్‌దే ఈ ఏడాది ఐపిఎల్‌ టైటిల్‌ : బిన్నీ

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ 2018 సీజన్‌ టైటిల్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు గెలుస్తుందని…ఆ జట్టు ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్‌ 7 నుంచి ఈ ఏడాది ఐపిఎల్‌ ప్రారంభం కానుండగా…ప్రస్తుతం ఆ టోర్నీకి సిద్ధమవుతున్న బిన్నీ శనివారం మీడియాతో మాట్లాడాడు. ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్ల జాబితాలో ఉన్న స్టీవ్‌ స్మిత్‌, బెన్‌స్టోక్స్‌తో పాటు అజింక్యా రహానె, సంజు శాంసన్‌, యువ ఫాస్ట్‌ బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ జట్టులో ఉండటంతో… రాజస్థాన్‌కి టైటిల్‌ గెలిచేఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని బిన్నీ వివరించాడు. దీనికితోడు దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ మెంటార్‌గా ఉండటంతో జట్టు అవకా శాల్ని మరింత మెరుగుపరుస్తోందన్నాడు. 2008లో జరిగిన ఐపిఎల్‌ తొఇ సీజన్‌ టైటిల్‌ని రాజస్థాన్‌ రాయల్స్‌ గెలిచిన విషయం తెలిసిందే.

ఐపిఎల్‌ టైటిల్‌ని ఈఏడాది రాజస్థాన్‌ రాయల్స్‌ గెలవగ లదు. అంతర్జాతీయ క్రికెట్‌లో సూపర్‌ స్టార్స్‌గా ఉన్న బెన్‌స్టోక్స్‌, స్టీవ్‌ స్మిత్‌, బట్లర్‌తో పాటు భారత క్రికెటర్లు రహానె, సంజు శాంసన్‌, జయ దేవ్‌ ఉనద్కత్‌ జట్టుని గెలిపించగల సమర్థులే. మొదటి మ్యాచ్‌లో గెలిస్తే…చాలు ఆ గెలుపు బాటని ఆత్మవిశ్వాసంతో టోర్నీ మొత్తం కొనసాగిం చొచ్చని బిన్నీ ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్‌ 9న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌జట్టుతో తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఉప్పల్‌ వేదికగా తలపడనుంది. స్టీవ్‌స్మిత్‌ రాజస్థాన్‌ జట్టుకి కెప్టెన్‌గా ఎంపికవగా..హైదరాబాద్‌ జట్టుకి డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.