రాజసం ఉట్టిపడేలా బాలయ్య లుక్‌!

BALA Krishna
Bala Krishna in ‘ Gowthami putra Satakarni’

రాజసం ఉట్టిపడేలా బాలయ్య లుక్‌!

గౌతమీ పుత్ర శాతకర్ణిగా నందమూరి బాలకష్ణ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఓ రాయల్‌ లుక్‌ ను ఈ రోజు చిత్రం యూనిట్‌ విడుదల చేసింది. రాజసం ఉట్టిపడుతున్న రీతిలో శాతకర్ణి పాత్రధారి బాలకష్ణ సింహాసనంపై ఠీవీగా కూర్చున్న ఈ లుక్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ పాత్రకు .. ఆ గెటప్పుకు బాలయ్య మాత్రమే సరిపోతాడన్న రీతిలో ఈ పోజులో ఆయన రాజసం ఒలకబోస్తున్నారు. తెలుగు నేలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రెండో శతాబ్దానికి చెందిన గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్రను ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్టు చిత్రం షూటింగ్‌ జోరుగా సాగుతోంది. వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యే ఈ చిత్రంలో శ్రియ, హేమమాలిని, కబీర్‌ బేడీ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు.