రాజమౌళికి కోర్టు నోటీసులు

RAJAMOULI

రాజమౌళికి కోర్టు నోటీసులు

మొన్ననే పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శకుడు రాజమౌళికి ఇపుడు పెద్దచిక్కొచ్చిపడింది.. ఏకంగా ఆయనకు కోర్టు సమన్లు అందాయి.. ఓచీటింగ్‌ కేసుకు సంబందించి చాలా కాలంగా కోర్టుకు హాజరుకానందున సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 24న ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎమ్మెల్యే కాలనీలోని ఫొటోగ్రాఫర్స్‌ కాలనీలో ప్టాట్‌ను తనకు విక్రయిస్తాననిచెప్పి అగ్రిమెంట్‌ చేసుకుని, తర్వాత మరొకరికి అమ్మారంటూ భువనేశ్వర్‌ అనే దర్శనకుడు రాజమౌళిపై ఫిర్యాదు చేశారు. ఈకేసు 2012కు సంబంధించినది. అయితే పోలీసులు రాజమౌళిపై కేసు నమోదుచేసినా కూడ రాజమౌళి కోర్టులో విచారణకు హాజరు కావట్లేదు.. అందుకే ఇపుడు కోర్టు సమన్లు జారీ చేసింది.