రాజమండ్రిలోఅగ్నిప్రమాదం 60 పూరి గుడిసెలు దగ్ధం

FIRE
FIRE

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ మండలం కొంతమూరు జంగాల కాలనీలో ఓఇంట్లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటనలో 60 పూరి గుడిసులు అగ్నికి అహుతయ్యాయి. ఈరోజు ఉదయం ఈప్రమాదం జరిగింది. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.