రాజమండ్రికి ‘మజ్ను
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో సినిమా షూట్ ఫినిష్ చేసిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ముజ్ను షూటింగ్లో బిజీ అయ్యాడు. డిసెంబర్ 1 నుంచి వైజాగ్‌లో స్టార్ట్ అయిన మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చిన ఈచిత్రం టీం తదుపరి షెడ్యూల్‌ని రాజమండ్రిలో షూట్ చేయనున్నారు. షూటింగ్ కోసం ఈ చిత్రం టీం రాజమండ్రి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. డిసెంబర్ చివరి వారంలో ఈ షెడ్యూల్ మొదలు కానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం మలయాళ సూపర్‌హిట్ అయిన ప్రేమమ్.. సినిమాకి రీమేక్. ముగ్గురు హీరోయిన్లు ఉండే ఈ సినిమాలో శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్‌లను ఎంపిక చేశారు. 3వ హీరోయిన్గా రెజీనా ఓకే అవకాశం ఉందని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల వద్దకు రానుంది