రాజన్న ఆలయంలో భక్తుల తాకిడి

Vemulawada Temple
Vemulawada Temple

వేములవాడ: వరుస సెలవులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. వేకువ జామునే
భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఆలయ అధికారులు గర్భగుడిలో
ఆర్జిత సేవలైన అభిషేక, అన్న, ఆకుల పూజలను రద్దు చేశారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు
సమర్పించుకున్నారు. నిలువెత్తు బెల్లాన్ని తూకం చేయించుకోని భక్తులకు పంచిపెట్టారు. కళాభవన్‌లో భక్తులు కళ్యాణాల
మొక్కులు తీర్చుకున్నారు. వివిద ఆర్జిత సేవల ద్వారా రమారమి రూ.16 లక్షల ఆదాయం సమకూరినట్లు, రాజన్నను
దాదాపు పాతికవేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డీఎస్పీ
అవధాని చంద్రశేఖర్‌ నేతృత్వంలో పట్టణ సీఐ శ్రీనివాస్‌ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.