రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

indra karan reddy
indra karan reddy

వేములవాడ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరసి పోయింది. స్వామి వారికి ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, టిడిపి తరఫున జేఈఓ శ్రీనివాస రాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.