రాజధాని నిర్మాణం నాకు లభించిన గొప్ప అవకాశo

Ap CM Chandra babu Naidu
Ap CM Chandra babu Naidu

రాజధాని నిర్మాణం నాకు లభించిన గొప్ప అవకాశమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో అమరావతి డీప్ డైవ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ…  సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానన్నారు. అధికారంలోకి రాగానే సింగపూర్ వెళ్లానన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

అమరావతిలోని మంచి వాతావరణంతో ఆయుష్షు పెరుగుతుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో అమరావతి డీప్ డైవ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ…సైబరాబాద్ నిర్మాణం కోసం ఇలానే మేధోమథనం జరిగిందన్నారు. సిలికాన్ వాలీలో అతి ఎక్కువ జీతం పొందేవారిలో ఆంధ్రావాళ్లే ఉన్నారన్నారు. వర్క్ షాపులో అభిప్రాయాలను అమరావతి నిర్మాణంలో వాడుతామన్నారు. ప్రపంచంలో బెస్ట్ క్యాపిటల్ కోసం తపన పడుతున్నానని చంద్రబాబునాయుడు అన్నారు.