రాజకీయ రాయభారం

KCR,MODI, BABU
KCR,MODI, BABU

రాజకీయ రాయభారం

కేంద్ర, రాష్ట్రాల మధ్య గవర్నర్‌ నరసింహన్‌ దౌత్యం?
మోడీకి వివరాలు ఇచ్చేందుకు నేడు ఢిల్లీకి పయనం
ఎపిలో జగన్‌, పవన్‌ను కలిపి బిజెపి వైపు తిప్పారా?
బాబుపై వ్యతిరేకం, కెసిఆర్‌పై సానుకూల నివేదికలా?

వై.నాగేశ్వరారవు / హైదరాబాద్‌
ఎన్నికల సంవత్సరం కావడంతో తెలు గు రాష్ట్రాల్లో పెరిగిన రాజకీయ వేడిని కేంద్రంపై పెరుగుతున్న వ్యతిరేకత వంటి అంశాలను ఎప్పటికప్పుడు ప్రధాని మోడీకి నేరుగు అందిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌ తాజా నివేదికతో మంగళవారం హస్తినకు వెళ్లను న్నారు. ఇటీవల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష నిర్వహించి ప్రధానిపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తిన వెంటనే విజయవాడకు వెళ్లి గవర్నర్‌ సిఎం సమావే శమయ్యారు.

అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తోనే భేటీ అయ్యారు. గరంగరంగా ఉన్న చంద్రబాబును బుజ్జగిం చేందుకు విఫల ప్రయత్నం చేసి నట్లుగా ప్రచా రంఉంది. అయి నప్పటికీ తన ప్రయత్నాలను నేరుగా ప్రధానికి ఆయన వివరించనున్నారు. కేంద్రా నికి, రాష్ట్రాలకు మధ్య ఎడబాటు పెరగకుండా ఇద్దరు ముఖ్యమం త్రులకు సలహాలు,సూచనలు ఇవ్వడం ద్వారా మధ్యవర్తిత్వం జరుపు తున్నారు. వారితో జరిపిన చర్చల ఫలితాలను, ఏపిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌రెడ్డి, అధినేత జనసేన పవన్‌ కళ్యాణ్‌ బిజెపికి అనుకూలంగా ఉండేలా తన వ్యూహాలను కేంద్రానికి వివరించేందుకు ఆయన సిద్ధమయ్యారు.

ఏపిలో ప్రధాన ప్రతిపక్ష నేతజగన్‌ రాజభవన్‌ నుంచి పిలుపు ఉన్నా రాకపోయేవారు, కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్న పవన్‌కు రాజ్‌భవన్‌ నుంచి పిలుపు ఉండటం ఏమిటీ? ప్రశ్న కూడా వచ్చింది. కానీ వారు అనూహ్య రీతిలో రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోమ్‌లకు హాజర య్యారు. వారి రాకపై చర్చ నీయాంశం కూడా అయింది. ఏపిలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ నర సింహన్‌ ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని వివరాలను అందజేసేందుకు ఈనెల 24న(మంగళవారం) ఢిల్లీకి వెడుతున్నారు. పెద్దలందరితో భేటీ ముగిసిన తర్వాత ఆయన 26న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిసే అవకాశం కూడా లేదంటున్నారు.