రాజకీయాల కతీతంగా పార్టీలన్నీ ఏకం కావాలి

ASHOK BABU
ASHOK BABU

తిరుపతి: రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం అన్ని పార్టీలు ఏకంకావాలని ఏపి ఎన్జీవో అద్యక్షుడు అశోక్‌బాబు కోరారు. తిరుపతిలో ఏపి అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో మోదీపై తెలుగోడి తిరుగుబాటు పేరుతో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరించిన తీరును ఎండగట్టేందుకు నేతలంతా కలిసి పోరాడాలని కోరారు.