రాజకీయాల్లో నీతిమంతులు ఉండబోరు..

UNDAVALLI
UNDAVALLI

రాజమండ్రి: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మండిపడ్డారు. రాజకీయాల్లో నీతిమంతులెవరూ ఉండబోరని ఐనా మేకింగ్‌, టేకింగ్‌ తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబరావు తనపై విమర్శలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు? బాండ్లు, పోలవరం, గృహనిర్మాణం, పరిశ్రమలు, పట్టిసీమలపై చర్చకు తాను సిద్ధమని అన్నారు. ఏ విషయంలోనైనా తనది తప్పుంటే వెంటనే క్షమాపణ కోరతానని ఉండవల్లి అన్నారు.