రాజకీయాల్లోకి రజనీ కాంతం

                       రాజకీయాల్లోకి రజనీ కాంతం

Rajanikanth
Rajanikanth

దవీ వ్యామోహమో, ఫ్యాషన్‌ సంస్కృతో, లేక ఆర్థిక వెన్నుదన్నుకోస మో తెలియదుకానీ, కాస్త సమా జంలో పేరుప్రతిష్టలు సంపాదించి న ప్రతివాళ్లూ రాజకీయాల మీద కన్నేస్తున్నారు. సమసమాజ స్థాపన, సమకాలీన రాజకీయం, విలువలకు పట్టంకట్టడం అనేది రాజకీయ అక్షయపాత్ర చిల్లులోంచి ఎప్పుడో కారిపోయి కాల గర్భంలో కలిసిజనానికి కాలుష్యాన్ని మిగిల్చింది. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకొని రెట్టింపు కృషితో అభివృద్ధికి బాటలు వేయాలనే పెద్దలసూత్రాన్ని వక్రీకరించి, రాజకీయ నాయకులు గాని, ప్రజలు గాని ఏదైనా సంక్షోభాన్ని కూడా రాజకీయాలు చేసి లబ్ధిపొంది రాజకీయాలను రోగగ్రస్థం చేసి నయంకాని అంటువ్యాధితో అంటకాగుతున్నారు.

అయినా అందరికీ రాజకీ యాలంటే మక్కువ ఎందుకో తెలియదు. ఆర్థిక అసమానతలతో కృంగిపోతున్న పట్టణ, గ్రామీణ ప్రజల గురించి కానీ, నాడు దేశాన్ని రాష్ట్రాలను పంటలతో ‘అన్నపూర్ణగా కీర్తికెక్కించి నేడు ఆకలికేకలు వేస్తున్న రైతాంగం గురించి కాని, దేశవ్యాప్తంగా వయ సు తారతమ్యం లేకుండా ఇండ్లల్లోనూ వీధుల్లోను ఉద్యోగ విధు ల్లోనూ, భద్రత అనేదే కరువై అత్యాచారాలకు గురవ్ఞతున్న మహి ళాలోకం గురించికాని, భవిష్యత్తులో ఏదో సాధిద్దామని కలలుగని తల్లిదండ్రుల ఒత్తిడితో తలభారమైన విద్యను బుర్రలోకి ఎక్కిం చుకొని పట్టాలు పుచ్చుకొని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా కోట్లా ది మంది నిరుద్యోగులు తయారై ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్యుల గురించి నిధులు కేటాయించక, కేటాయించిన నిధుల ను నిర్లక్ష్యంతో ఖర్చుపెట్టక నిర్దేశిత లక్ష్యాలను కాగితాలకు పరి మితం చేస్తూ, విద్య,వైద్యం మొదలగు రంగాలను భ్రష్టు పట్టించి న వ్యవస్థల గురించి, సంస్కరణల పేరుతో ఆర్థికరంగాన్ని నడి వీధిలో నడ్డి విరిచిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కుదేలై మూతపడ్డ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగుల గురించి ప్రభుత్వ ఉద్యోగాల్లోని కొంతమంది పాముల్లాంటి అధికా రగణం కోట్లకు పడగలెత్తుతున్న వైనం గురించి ఎవ్వరూ తీవ్రంగా ఆలోచించడం లేదు.

ఇవేవి సమస్యలే కానట్లు కూడగట్టుకున్న కొద్ది మంది లబ్ధిదారులైన కోటరీకి తాళాలిచ్చి భజన చేయించు కుంటూ అంతా బాగుందనే భ్రమల్లో జనాన్ని ఉంచుతున్న ఈ వ్యవస్థల్లో ఏ నటులైనా, రాజకీయ నాయకులైనా ప్రవేశించి కడి గిన ముత్యాల్లా పనిచేస్తారని ప్రజలు భావించడం లేదు. మాన వతా విలువలన్నీ ఆర్థిక సంబంధాల చుట్టూ చక్కర్లు కొడుతూ దానవత్వాన్ని సంతరించుకుంటున్నాయి.ఓట్ల కోసం, సీట్ల కోసం, కులమత వర్గ విభేదాలకు ఆజ్యం పోసి అధికారం వచ్చిన తర్వాత అందరినీ దూరంగా పెట్టి ఆనందంగా అధికారం అనుభవించే సంస్కృతిలోకి మరికొంతమంది కొత్త నాయకులు వచ్చి ఊసరవెల్లి లా ఆ రంగుల్లో కలిసి మనకు ఈస్టమన్‌ రంగులుచూపిస్తున్నారు. అధికారమే పరమావధిగా తమిళనాడులో అనిశ్చిత పరిస్థితులను సృష్టిస్తున్న కొన్ని రాజకీయ శక్తుల మద్య కొత్తగా వచ్చి తలదూర్చి నేను ప్రత్యేకం.

ప్రశ్నించడానికి వచ్చానన్న తర్వాత విధానాలు ప్రకటించకుండా మౌనం పాటిస్తే ప్రయోజనం లేదు. అన్ని ప్రభు త్వాల నోళ్లలోనానుతున్న అభివృద్ధి అనేదానికోసం కళ్లలో వత్తులు వేసుకొని కాగడాలు పట్టుకొని వెతుకుతున్న జనం కోసం వెలుగు దివ్వెగా నిలబడగలిగే వారిని స్వాగతించాల్సిందే. కొత్తగా వచ్చిన వాళ్లుకొత్తదనం చూపించి ప్రజల మేలుకోసం ఏమైనా చేయగలరే మో నని ఎదురు చూడాల్సిందే. కానీ 70 వసంతాలు దాటుకున్న స్వతంత్య్ర భారతావనిలో ఇంకాయాభై శాతం ప్రజలు దారిద్య్రరేఖ కు దిగువన అట్టడుగు జీవితాన్ని గడుపుతున్న వాస్తవం ఎరి పాపమో తెలియదు.కొత్తగావచ్చి ఏవోఅద్భుతాలు చేస్తామని చెప్పి న అనేక రాజకీయపార్టీలు పాతపార్టీల మాస్క్‌లనే ఉపయోగిస్తు న్నాయి.

అర్థంకాని అనేక ప్రశ్నల కు సమాధానాలను, సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేకరుగ్మతలను ఆకళింపు చేసుకొని మంచి మా ర్గంవైపు అడుగులు వేస్తే అందరికీ సంతోషం.విలువలకు తిలోద కాలిచ్చి,సిద్ధాంతాలను గాలికొదిలి చట్టం,న్యాయం, ధర్మం, రాజకీ యం, నీతి,అవినీతి అన్నీఒకే తాను ముక్కలుగా కలగాపులగంగా చేస్తూ సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోతున్న వైనాన్ని ప్రశ్నించే కొత్తరాజకీయ వ్యవస్థను ప్రజలు కోరుకుంటున్నారని తెలుసుకొని ఆ దిశగా ఆలోచించే ఏ నటుడైనా, రాజకీయ నాయకుడైనా దేవ్ఞడు శాసించే విధానాలు కాకుండా ప్రజలు ఆశిం చే విధానాలు పాటిస్తే ప్రజలు వారిలో ఆ దేవ్ఞణ్ణే చూస్తారు.
– జోస్యుల వేణుగోపాల్‌