రాచరికపు అహంకారానికి నిలువెత్తు నిదర్శనం అశోక్‌ వ్యాఖ్యలు

 

YSRCFFFFFFF
YSRCP

విజయనగరంః వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు మాటలు రాచరికపు అహంకారానికి నిదర్శనంగా ఉన్నాయని విజయనగరం వైసిపి జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజల మదిలో ఉండే మహనీయుల విగ్రహాలు పెట్టడం సహజమన్నారు. సోమవారం వైసిపి కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి అప్పట్లో లేఖ రాసింది అశోక్‌ గజపతిరాజేనని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎన్‌టిఆర్‌ విగ్రహాలతో లబ్ధి పొంది ఆయనకు వెన్నుపోటు పొడిచిన కుట్రకు ఆనాడు అశోక్‌ ఇల్లే వేదికైందని విమర్శించారు. ప్రజాసమస్యలపై మంత్రి అశోక్‌ ఏనాడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. విజయనగరం కోట చుట్టూ ఉన్న పేదల షాపులను కోట అభివృద్ధి పేరుతో తొలగించి వారిని రోడ్డున పడేశారన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సుజరుకృష్ణ రంగారావు ప్రభుత్వ భూములను కొట్టేసి రూ.కోట్లు సంపాదించారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో వాటాలు కుదరక నిర్మాణంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.