రాగిపిండి బిస్కెట్స్‌

RAGI
RAGI BISCUITS

రాగిపిండి బిస్కెట్స్‌

కావలసినవి
ఓట్స్‌-100గ్రా రాగిపిండి-50గ్రా వాము-కొద్దిగా చక్కెర-రెండు టేబుల్‌స్పూన్‌ ఉప్పు-అర టేబుల్‌స్పూన్‌ వెన్న-ఒక టేబుల్‌ స్పూన్‌

తయారుచేసే విధానం

ఓట్స్‌ కాస్త వెన్న వేసి వేయించి పొడిచేసుకుని, అందులో రాగిపిండి వాము, ఉప్పు, చక్కెర వేసి కాస్త నీరు చిలకరించి పిండి కలిపి చపాతీ లాగా రుద్ది షేప్‌లో కట్‌చేసుకుని ఓవెన్లో 15ని.పాటు 45డిగ్రీల వద్ద బేక్‌ చేసుకుంటే మంచి కరకరలాడే టేస్టీ ఓట్స్‌-రాగిపిండి బిస్కెట్స్‌ తయారవ్ఞతాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఓవెన్‌ లేని వారు కుక్కర్‌లో ఇసుక వేసి అందులో ఒక ప్లేట్‌ మీద బిస్కెట్స్‌ పెట్టి గ్యాస్కెట్‌ లేకుండా మూతపెట్టి సన్నని మంటమీద 15ని.లు వేడిచేసుకోవాలి. బిస్కెట్స్‌ రెడీ అవుతాయి.