రాంచీ: తొలి టీ20 భారత్ విజయభేరి

ఆస్ట్రేలియాతో మూడు టీ20 సిరీస్లో భాగంగా నేడు రాంచీలో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి
బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన క్రమంలో వరణుడు అంతరాయం కలిగించాడు.
దీంతో సుమారు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం భారత్కు ఆరు
ఓవర్లలో 48పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఒక వికెట్ కోల్పోయి, ఇంకా మూడు బంతులు
మిగిలి ఉండగానే (49/1(5.3) లక్ష్యాన్ని చేధించింది.