రష్మికకు టైటిల్‌

RASHMIKA
RASHMIKA

రష్మికకు టైటిల్‌

హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటిఎఫ్‌) జూనియర్‌ గ్రేడ్‌-5 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సత్తా చాటింది. వియత్నాంలోని హెచిమిన్‌ సిటీలో జరిగిన ఈ టోర్నీలో ఆమె విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. బాలికల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ శ్రీవల్లి రష్మిక (భారత్‌) 6-4, 6-2తో చైనాకు చెందిన టాప్‌ సీడ్‌ యుజియావోను కంగుతినిపించింది.