రమణ అద్వర్యంలో ఎన్నికల సమన్వయ కమిటీ

L.Ramana
L.Ramana

టిటీడీపీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. నిన్న ఉదయం నుండి పార్టీ అధినేతతో చర్చలు సాగించిన నేతలు మొత్తం మూడు కమిటీలుగా ఏర్పడ్డారు. ఎన్నికల సమన్వయ కమిటీగా ఎల్ రమణ అద్వర్యంలో సీనియర్ నేతలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి, పెద్దిరెడ్డి, మండవ ఉన్నారు. ఇప్పటికే ఈ నేతలు ఎన్నికల పొత్తులు, కలయికల మీద దృష్టి పెట్టి పలు పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.