రబాడ శిక్ష తగ్గింపుపై స్పందించిన స్మిత్‌

SMITH-
SMITH

రబాడ శిక్ష తగ్గింపుపై స్పందించిన స్మిత్‌

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ ఆట కంటే…గొడవలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొదట డేవిడ్‌ వార్నర్‌, డికాక్‌ డ్రెస్పింగ్‌ రూముకి వెళుతూ గొడవపడగా…ఆ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ని మైదానంలో భుజంతో ఢీకొట్టి రబాడ కవ్వింపు చర్యలకి దిగాడు. స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ తీసినా రబాడ… అతను పెవిలియన్‌కి వెళ్తుంటే ఉద్ధేశపూర్వకంగానే వెళ్లి తన భుజంతో అతడ్ని ఢీకొట్టాడు. దీంతో…క్రమశిక్షన తప్పిన రబాడ మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధించడంతో పాటు…అతని ఖాతాలో మూడు డీమెరిట్‌ చేరుస్తూ మ్యాచ్‌ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు.

అప్పటికే ఐదు డీమెరిట్‌ పాయింట్లతో ఉన్న రబాడ ఖాతాలోకి మరో మూడు పాయింట్లు చేరడంతో అతనిపై రెండు టెస్టుల నిషేధం పడింది. అయితే…ఈ శిక్షపై రబాడ అప్పీల్‌ చేసుకోగా…విచారణ జరిపిన కమీషనర్‌…వికెట్‌ తీసిన ఆనందంలో అలా ఢీకొట్టాడే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా కాదని తేల్చి…మ్యాచ్‌ ఫీజుని 25శాతానికి, రెండు డీమెరిట్‌ పాయింట్లను తగ్తించాడు. దీంతో…అతనిపై ఉన్న నిషేదం తొలిగిపోయి.. .మూడో టెస్టు ఆడేందుకు మార్గం సుగమమైంది.