రజనీ కబాలి ఆడియో విడుదల

KABALI
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్‌ బ్యానర్‌పై పా రంజిత్‌ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్‌కుమార్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం కబాలి. రజనీకాంత్‌ సరసన రాధికా అప్టే హీరోయిన్‌గా నటించారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద జె.ఆర్‌.సి.కన్వెక్షన్‌ సెంటర్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో టి.సుబ్బిరామిరెడ్డి, హీరో వరున్‌ తేజ్‌, హీరో నాని, పుల్లెల గోపీచంద్‌, పా రంజిత్‌, సాయిధన్సిక, కలైఅరసన్‌, పరందామన్‌, నటరాజన్‌, సంతోష్‌ నారాయణ్‌, చాముండేశ్వరినాథ్‌, జూపల్లి కృష్ణ, రఘురామ కృష్ణంరాజు, పరుచూరి గోపాలకృష్ణ, అభిషేక్‌ నామ, కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌, ప్రతాని రామకృష్ణగౌడ్‌, సుధాకర్‌ కొమాకుల, నవీన్‌కృష్ణ, కేధారి, ధన్యబాలకృష్ణన్‌, దేవీ చౌదరి, అవంతి శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ బండారు, రీతూ వర్మ తదితరులు పాల్గొన్నారు.బిగ్‌ సిడి, ఆడియో సిడిలను హీరో వరుణ్‌ తేజ్‌ విడుదల చేశారు.టి. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు రజనీకాంత్‌ అంటే చాలా అభిమానం. ఆయన్నెంతో గ్రాండ్‌గా రిసీవ్‌ చేసుకుంటారు. రజనీకాంత్‌గారు భారతదేశ చలన చిత్రానికి దొరికిన కోహినూర్‌ డైమండ్‌. తన యాక్టింగ్‌, డ్యాన్సుల, ఫైటింగ్స్‌ చేసిన ఏదీ చేసినా సంచలనమే అన్నారు. హీరో నాని మాట్లాడుతూ అంరిలా రజనీకాంత్‌గారిని ఇమిటేట్‌ చేయడానికి ప్రయత్నించిన వారిలో నేను ఒకడ్ని. నేను రోబో సీక్వెల్‌ కంటే కబాలి కోసం వెయిట్‌ చేస్తున్నాను. కబాలి టీజర్‌, సాంగ్స్‌ చూస్తుంటే నాకు రజనీకాంత్‌గారి భాషా సినిమా గుర్తుకు వస్తుంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అన్నారు.పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ నేను చిన్నప్పుడు రజనీకాంత్‌ గారికి పెద్ద ఫ్యాన్‌. టీం అంతటికీ కంగ్రాట్స్‌. నిర్మాతలకు అభినందనలు అన్నారు. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ నిర్మాతలు తెలుగు రైట్స్‌ను చేజిక్కించుకోవ డంతోనే సక్సెస్‌ అయ్యారు. వారికి ఆల్‌ ది బెస్ట్‌. దర్శకుడు గత చిత్రాలు రెండు మంచి విజయాలను సాధించాయి. తన మూడో సినిమా కబాలి సూపర్‌హిట్‌ అవుతుంది. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.