రక్షణ వ్యయం కోసం 700 బిలియన్‌ డాలర్లు

 

Trump
Trump

దేశానికి వెన్నుముక నిలుస్తున్న సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. రక్షణ వ్యయం కోసం ఈ ఏడాది 700 బిలియన్‌ డాలర్లు (రూ.44,95,491 కోట్లు) కేటాయించామని అన్నారు. దేశ సౌర్వభౌమత్వాన్ని పరిరక్షీంచుకునేందుకు పాటుపడతామని అన్నారు. సైనికుల సంఖ్యను పెంచడంతో పాటు  క్షిపణుల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రక్షణ వ్యయంలో రష్యా, చైనా దేశాలను అధిగమించాలన్నదే తమ ఏకైక లక్ష్యమని అన్నారు. వచ్చే ఏడాది 716 బిలియన్‌ డాలర్లు (రూ.45,98,491 కోట్లు) ఖర్చు చేయనున్నట్టు ట్రంప్‌ పేర్కొన్నారు.