రక్షణ భాగ్యం

JESUS-1
JESUS-

రక్షణ భాగ్యం

నేక సంవత్సరాల పాటు అక్కడి జైళ్లలోనే మగ్గిపోయే వారు. ఈ విషయం అనేకులు కథల రూపంలో రాశారు. వీరిలో డేవిడ్‌ మోరెల్‌ రాసిన ఫస్ట్‌ బ్లడ్‌ అనే నవల చాలా ప్రసిద్ధి పొందింది. 1955 నుంచి 1975 వరకు జరిగిన ఈ యుద్ధంలో సుమారు 19,42,000 మంది వియత్నాం ప్రజలు, 58,000 అమెరికన్‌ సైనికులు మరణించారు. ఒక క్యాంప్‌లో 12మంది సైనికాధికారులను బంధించారు. వారు తమ దగ్గర ఉన్న సాధనాలను ఉపయోగించి ఒక టైంబాంబ్‌ను తయారు చేసారు. వారికి ఆహారం అందించే వ్యక్తికి వేల డాలర్లను లంచంగా ఇచ్చి తాము తప్పించు కొని ఫలానా చోటుకు వస్తున్నా మని అక్కడ ఒక హెలికాప్టర్‌ను ఉంచితే తాము క్షేమంగా అమెరికన్‌ సైన్యాన్ని చేరుకుంటామని వార్త పంపారు. అమెరికన్‌ సైనికాధికారి మీరు చెప్పినట్లే హెలీకాప్టర్‌తో అక్కడ ఉంటామనీ, మీరు అక్కడికి రాగలిగితే క్షేమంగా మమ్మల్ని చేరుకోవచ్చునని తెలియజేసారు. జైలు చుట్టుఉన్న ఫెన్సింగ్‌ను పేల్చివేస్తే తాము క్షేమంగా జైలును దాటి వెళ్లిపోవచ్చునని వారు తలపోసారు. అయితే టైంబాంబ్‌ను ఫెన్సింగ్‌ వద్ద ఎవరు పెడతారు?

ఆ 12మందిలో ఒక వ్యక్తికి వివాహం కాలేదు. అతడు తాను ముళ్లు ఉన్న బార్బడ్‌ వైర్‌ను దూకి రెండవ పక్కకు వెళ్లి ఫెన్సింగ్‌ వద్ద టైంబాం బను రహస్యంగా అమర్చివస్తానని చెప్పాడు. బార్బ్‌డ్‌ వైర్‌కు, ఫెన్సింగ్‌కు మధ్య దూరం రెండు గజాలు మాత్రమే. ఒకరాత్రి వేళ అతడు పరుగెత్తుకుంటూ వచ్చి ముళ్లతీగపై నుంచి దూకి ఫెన్సింగ్‌ వద్దకు చేరాడు. టైంబాంబ్‌ 24 గంటల్లో పేలేలా అమర్చాడు. అయితే అతనికి తిగిరి వచ్చేందుకు కష్టమైంది. ఐదు అడుగుల ఎత్తైన ముళ్లతీగను దాటేందుకు కనీసం 10 గజాలు పరుగెత్తుకొని వచ్చి దూకాలి. అయితే ముళ్ల తీగెకు ఫెన్సింగ్‌కు మధ్య దూరం కేవలం రెండు గజాలే గనుక అతడు ముళ్ల తీగెను

దాటి తన గుడారానికి రాలేక పోయాడు. అందుచేత ముళ్ల తీగె ఉన్న కంచెలో ఎక్కడైనా ఖాళీ ఉన్నదేమో, దానిలో నుండి దూరి పోవచ్చునేమో అని అతడు కంత కోసం వెతుకుతూ కంచె వెంబడి పాకుతూ వచ్చినా తాను పట్టేటంత ఖాళీ అతనికి ఎక్కడా కనబడలేదు. అంతలో వియత్నాం సైనికులు అతనిని చూసి కాల్చి చంపారు. వియత్నాం సైనికులు అతడు ఏ గుడారం నుండి వచ్చాడో గుర్తించి ఆ గుడారం వద్ద అతని శవాన్ని పడేశారు. 11మంది అమెరికా సైనికాధికారులు అతనిని చూసి ఎంతో ఏడ్చారు. అతనిని సమాధి చేశారు. మరుసటిరోజు రాత్రి అతడు అమర్చిన టైంబాంబ్‌ పేలింది. సిద్ధంగా ఉన్న 11 మంది సైనికాధికారులు పరుగెత్తుకుంటూ వచ్చి ముళ్ల తీగను దూకి, ఫెన్సింగ్‌లో బాంబు ద్వారా ఏర్పడిన ఖాళీ గుండా పరుగెత్తి క్షేమంగా తాను చెప్పిన స్థలానికి చేరారు. సిద్ధంగా ఉన్న హెలికాప్టర్‌ ఎక్కి క్షేమంగా తమ సైన్యంలో చేరారు. తమ స్నేహితుని ప్రాణ త్యాగం ద్వారా వారు జైలు నుండి తప్పించుకొని రాగలిగారు. వారు అతనిని జ్ఞాపకం చేసు కుంటూ ప్రతి నెల అతని కుటుంబసభ్యులకు ఆర్థికసాయం చేయాలని సంకల్పించారు.

రెండువేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు తన ప్రాణ సమర్పణ ద్వారా మనకు రక్షణ కలుగుచున్నది. పాపమనే ఫెన్సింగ్‌ క్రీస్తుయేసు తన మరణం ద్వారా కూల్చివేశాడు. ప్రభువ్ఞ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం కూడా పరలోకభాగ్యాన్ని పొందగలం. ఒక వ్యక్తి త్యాగం ద్వారా 12మంది సైనికాధికారులు రక్షించబడ్డారు. అలాగే ఒక్క పుణ్యమూర్తి అయిన యేసుక్రీస్తు త్యాగం ద్వారా సర్వలోకంలో ఉ న్న ప్రజలకు రక్షణ భాగ్యం లభిం చింది. కానీ అందరూ ప్రభువ్ఞను దేవ్ఞడిగా అంగీకరించడం లేదు. ఆయనను తమ ప్రభువ్ఞగా అంగీకరించడమే కాదు, తన కోసమే క్రీస్తు మరణించాడని విశ్వసించిన వారు మాత్రమే రక్షించబడతారు. ‘తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవ్ఞని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించెను (యోహాను 1:11) అనే ఈ వాక్యాన్ని ఎవరైతే నమ్మి, విశ్వాసం చూపు తారో వారిదే పరలోక రాజ్యం. ఇట్టి కృప మనమంతా ఉండాలని ప్రభువ్ఞ కోరిక.

– పి.వాణీపుష్ప