రక్షణ,భద్రతరంగాలపై పరస్పరసహకారం

PM-OLI
K P Sharma & Mody

న్యూఢిల్లీ: రక్షణరంగం, వాణిజ్యరంగాలపై ప్రత్యేకశ్రద్ధచూపించిన నేపాలి ప్రధానమంత్రి ఓలి ప్రధాని మోడీతో జరిపిన చర్చల్లో రెండుదేశాలమధ్యసంబంధాలను మరింతగా పరిపుష్టంచేయాలని భావించారు. రెండుదేశాలమధ్య మరింతగా సహకారం పెంపొందాలని, నేపాల్‌లోప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎంతో కీలకం అవుతుందని నేపాల్‌ప్రధాని ఓలి వెల్లడించారు. రక్షణరంగం,భద్రత, కనెక్టివిటీ, వాణిజ్యం, వ్యవసాయ రంగాలపరంగా రెండుదేశాలమధ్య పరస్పర సహకారం మరింతగాపెరగాలని కోరారు. భారత్‌పరంగా మోడీ మాట్లాడుతూ నేపాల్‌కు సంపూర్ణమద్దతునిస్తుందని అన్నారు. అన్నిరంగాల అభివృద్ధికి భారత్‌ బాసటగా నిలుస్తుందన్నారు. లోతైన సహకారంతో రెండు దేశాల అధిపతులు నేపాల్‌లోని ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టంచేయాలని నిర్ణయించారు. చైనాతో మరింత సత్సంబధాలు కోరుకుంటున్నఓలి భారత్‌తో తమ దేశం నమ్మకమైన భాగస్వామిగా కొనసాగాలని కోరుకుంటున్నదని అన్నారు. ఉన్నతశిఖరాలకు రెండుదేశాల సంబంధాలు తీసుకెళ్లే లక్ష్యంతోనే తాను భారత్‌ పర్యటనకు వచ్చానన్నారు. 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా రెండుదేశాల సంబంధాలు ఉండాలన్నారు. చైనాపట్ల సానుకూలధోరణితో ఉన్న 65 ఏళ్ల ఓలి నేపాల్‌ప్రధానమంత్రిగా ఫిబ్రవరిలో రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. 2015-16లో కూడా ఒకపర్యాయం ప్రధానిగా పనిచేసారు. ఖాట్మండు సంబంధాలు భారత్‌తో దెబ్బతిన్న తరుణంలోనే ఆయన బాధ్యతలుచేపట్టారు. శుక్రవారం న్యూఢిల్లీకి వచ్చిన ఓలి మూడురోజులపాటు భారత్‌లో ఉంటారు. నేపాల్‌ప్రధానిగా బాధ్యతలుస్వీకరించినతర్వాత ఓలి జరిపిన మొట్టమొదటి భారత్‌ పర్యటన ఇదే. మోడీ, ఓలిల సంయుక్తప్రకటనలో మాట్లాడుతూ రెండుదేశాల పరస్పరసహకారంతో నేపాల్‌ మరింత అభివృద్ధిదిశగా వెళుతుందన్నారు. భారత్‌ వ్యూహం సబ్‌కాసాత్‌,సబ్‌కా వికాస్‌ అన్న ప్రణాళికనేపాల్‌కుసైతం వర్తిస్తుందన్నారు. ఇకరక్షణరంగం, భద్రతా సంబంధాలపరంగా మోడీ మాట్లాడుతూ భద్రతపరంగా పటిష్టమైన బంధం ఉందని, తెరిచి ఉన్న సరిహద్దు దుర్వినియోగాన్ని పటిష్టంగా ఎదుర్కొంటామని అన్నారు. నేపాల్‌ను పర్యటించాల్సిందిగా మోడీని ఆదేశప్రధాని ఓలి ఆహ్వానించారు. నేపాల్‌లో జరిగిన జాతీయ, ప్రాదేశిక ఎన్నికలకు సుదీర్ఖఘక చరిత్ర ఉన్నదని ప్రజాస్వామ్యంపై ఆదేశ ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మోడీ ప్రశంసించారు. నేపాల్‌ప్రధాని ఓలి మాట్లాడుతూ మిత్రదేశాల సహకారాన్ని తమ దేశం కోరుతోందని అన్నారు. ప్రత్యేకించి పొరుగుదేశాలతో ఉన్న సంబంధాలు ఇతర దేశాల సంబంధాలకు భిన్నంగా ఉంటాయన్నారు. గతంలో ఓలి నేపాల్‌అ ంతర్గత వ్యవహారాల్లో జోక్యంచేసుకుంటున్నదని భారత్‌పై బహిరంగంగానే విమర్శలుచేసారు. అంతేకాకుండా తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రచేస్తున్నదని అన్నారు. ఎన్నికల్లో తనపార్టీ విజయఢంకా అనంతరం ఓలి మాట్లాడుతూ భారత్‌తో తాము భాగస్వామ్యం వహిస్తామని, దేశాన్ని మరింత ముందుకు నడిపించేందుకు ఆర్ధిక ప్రగతిని నమోదుచేసేందుకు భారత్‌తో స్నేహం అనివార్యమని ప్రకటించారు. భారత్‌నేపాల్‌మధ్యలో అరుణ్‌3 జలవిద్యుత్‌ప్రాజెక్టు అనేక సంవత్సరాలనుంచి స్తంభించిపోయింది. ఇకపై సంయుక్తంగా ఓలి మోడీల ఆధ్వర్యంలో ఈప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇద్దరునేతలు నేపాల్‌లోని బిర్‌గంజ్‌ చెక్‌పోస్టును సంయుక్తంగా ప్రారంభించారు. చెక్‌పోస్టు కార్యకలాపాలతో సరిహద్దు వర్తకం, స్మగ్లింగ్‌ను అరికట్టే వీలుంటుందని అన్నారు. మోడీ ఓలి ఇద్దరూ కూడా మోతిహరి, అమ్లేక్‌గంజ్‌ సరిహద్దు పెట్రోలియం పైప్‌లైన్‌ను బీహార్‌లోని మోతిహరిలో ప్రారంభించారు. అరుణ్‌-3 ప్రాజెక్టు పర్యావరణ వేత్తల ఆందోళనల్లో చిక్కుకుంది. మోడీ ఓలిలు ఇరువురూ వ్యవసాయరంగంలో పరస్పరసహకార ఒప్పందంపై సంతకాలుచేసారు. అలాగే రైల్వే లింకుల విస్తరణకుసైతం ఒప్పందాలుజరిగాయి. రాక్సౌల్‌నుంచి ఖాట్మండుకు రైల్వే సర్వీసులుప్రారంబానికి నిర్ణయించారు. భారత్‌నేపాల్‌లమధ్య ఇన్‌లాండ్‌ వాటర్‌వే కనెక్టివిటీపై కూడా ఒప్పందాలుచేసుకున్నారు. భారత్‌ ఇన్వెస్టర్లకు ఓలి మంచి మంచి ప్రతిపాదనలు తెచ్చినట్లు తెలుస్తోంది. ఫిక్కీ సదస్సులో ఓలి మాట్లాడుతూ ఇన్వెస్టర్లు ఎల్లవేళలా మార్కెట్లకోసం చూస్తారని, నేపాల్‌ పరిస్థితిన ఇచూడాలని, మాకు మార్కెట్‌ ఒక సమస్యకాదని ఉత్పత్తి అసలతు సమస్య అని అన్నారు. భారత్‌,చైనాలమధ్యనేపాల్‌ ఇమిడి ఉందని అందువల్ల 2.5 బిలియన్‌ల జనాభానుంచి హామీపూర్వక మార్కెట్‌కల్పిస్తామని ఓలి వెల్లడించారు. మాదేశం పరంగా సరళీకృత ఆర్ధిక విధానం అమలవుతుందని,ప్రైవేటురంగం కీలకభాగస్వామిగా ఆహ్వానిస్తున్నటుల వెల్లడించారు. మాధోరణులు మార్చుకోమని ప్రపంచ ధోరణులకు వ్యతిరేకంగా వెళ్ళబోమని ఆయన అన్నారు. భారత్‌ ఓలికి రెడ్‌కార్పెట్‌ వేసింది. హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ ఆయనకు స్వాగతం పలికితే రాష్ట్రపతి భవన్‌లో కూడా ఆయనకు సాంప్రదాయక స్వాగతం పలికింది. ప్రతినిధిబృందం చర్చలు ప్రారంభించేముందు ఇరుదేశాల నేతలు అనేక అంశాలపై విస్తృత చర్చలు జరిపారు.