రంగులతో మనోప్రవృత్తి

CHELI9
CHELI

రంగుతో మనోప్రవృత్తి

 

ప్రతి మనిషికీ ఓ ఇష్టం, అభిరుచి, హాబీ ఉండి తీరుతాయి. దాన్ని బట్టే వారి పర్సనాలిటీ వ్యక్తిత్వం తెలుస్తాయి కూడా.

ఆరెంజ్‌ కలర్‌ని ఇష్టపడేవారు ఇతరులతో కలిసిమెలిసి సోషల్‌గా మూవ్‌ అవుతారు. అంతా తమని ప్రేమించి గౌరవించాలని ఆశిస్తారు. ఛాలెంజ్‌గా ప్రతిదీ తీసుకునే ప్రవృత్తి వీరిది.

పసుపు వన్నెని మెచ్చేవారు మంచి తార్కికబుద్ధి కలిగి, వారిలోని సృజనాత్మకతను, ఐడియాల్ని ఇతరులకి తెల్పివారిని ప్రేరేపిస్తారు. ఆకుపచ్చ అంటే ఇష్టపడేవారు ప్రేమపై విశ్వాసం కలిగి ప్రేమించి, ప్రేమను పొందాలని ఆశిస్తారు. థాంక్యూ అని మనం అంటే చాలు బోలెడంత వెర్రి ఆనందంతో గంతులేస్తారు.

బ్లూ అంటే మక్కువ ఉన్నవారు మనశ్శాంతిని ఆశిస్తారు. తమకు సరియైనది, నచ్చింది అనే బాటలోనే సాగుతారు. ఇతర్లకోసం అని తమ భావాల్ని ఆలోచన్లని మార్చుకోరు. ఇండిగోని ఇష్టపడేవారు, తమ ఆధ్యాత్మిక భావాల్ని, ప్రవృత్తి ఇతరులు గ్రహించి అనుసరించా లనుకుంటారు.

పర్పుల్‌ లేక వైలెట్‌ని ఇష్టపడేవారు ఎమోషనల్‌ సెక్యూర్టీ కావాలనుకుంటారు. అంతా పర్‌ఫెక్షన్‌, సరిగ్గా ఉండాలని ఆలోచిస్తారు. సమాజానికి ఏదో చేయాలనే తపన వీరిలో ఉంటుంది.

పింక్‌ కలర్ని ఇష్టపడేవారు, ఎలాంటి షరతులు పెట్టకుండా తమని ఆదరించి ప్రేమించాలని కోరుకుంటారు. ్జ టర్‌కాయజ్‌ రంగుని కోరేవారు ఎమోషనల్‌ బాలెన్స్‌ని ఆశిస్తారు. తమ ఆలోచన్లు, కలలు పండించుకోటానికి తమ మార్గాల్ని వారే ఎన్నుకుంటారు.

మెజెంటా రంగుని ఇష్టపడేవారు ఈ ప్రపంచాన్ని వేరే దృష్టితో చూస్తారు. ్జ బ్రౌన్‌ కలల్ని కోరేవారు తమ కుటుంబం, ఫ్రెండ్స్‌తో వారి తోడ్పాటుతో సురక్షితంగా ప్రశాంతంగా జీవితం సాగిపోవాలనుకుంటారు.

బ్లాక్‌ కలర్‌ని వాడేవారు తమ ఎమోషనల్‌ ఇన్‌సెక్యూర్టీ నించి కాపాడుకోవటం కోసం పవర్‌ కంట్రోల్‌ ఉండాలనుకుంటారు. తెలుపుని ఇష్టపడేవారు సింపుల్‌గా ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

గ్రేకలర్‌ ప్రేమికులు శాంతిప్రియులు, ధైర్యం విశ్వసనీయత కలవారై ఉంటారు. ్జ సిల్వర్‌ కలర్ని ప్రేమించేవారు బాగా ఆత్మవిమర్శ, దూరపు దృష్టితో ఆలోచించే వారై ఉంటారు. గోల్డెన్‌ కలర్ని ఇష్టపడేవారు వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉండటమే గాక, ఇతరులు కూడా వారితో హాయిగా సురక్షిత భద్రతా భావంతో గడపగలుగుతారు.

ఇక కార్పెట్స్‌, రగ్గుల్ని కూడా తమ అభిరుచిని, స్వభావాన్ని బట్టి ఎన్నుకుంటారు. సమాజాన్ని గౌరవించి, దాని నియమాల్ని పాటించేవారు న్యూట్రల్‌ కలర్స్‌వి వాడతారు. ప్రాక్టికల్‌ నేచర్‌ ఉన్నవారు సింథటిక్‌ రగ్గుల్ని వాడతారు. ఇవి చౌక పైగా, వాటిని వాడటం, దాచటం కూడా తేలిక.