రంగస్థలం లుక్‌ అదిరింది..

RAMCHARAN-1
RAMCHARAN

రంగస్థలం లుక్‌ అదిరింది..

మార్చి30న విడుదల

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం ‘రంగస్థలం స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం) నిర్మాతలుఈ ప్రెస్టీజియస్‌ చిత్రాన్ని నిర్మించారు.. ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.. మార్చి 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
నిర్మాతలు మాట్లాడుతూ. రంగస్థలం ఫస్ట్‌లుక్‌కు విపరీతమైన స్పందన లభిస్తోందన్నారు. చిట్టిబాబు పాత్రలోరామ్‌చరణ్‌ మాస్‌ యాక్టింగ్‌, సమంత గ్లామర్‌ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందన్నారు. సుకుమార్‌ తనదైన స్టైల్‌లో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారన్నారు.. 5రోజుల టాకీ, రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందన్నారు. ఈనెలలోనే టాకీపార్ట్‌ పూర్తి చేస్తామన్నారు.. జనవరివరిలో రెండు పాటలను చిత్రీకరిస్తామన్నారు.. ఓ పాటలో పూజ హెగ్డే స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనున్నారన్నారు. దేవిశ్రీప్రసాద్‌ అద్భుతమైన సంగీతం అందించారన్నారు. పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలుచేస్తున్నామన్నారు.. మా సంస్థ ప్రతిష్టను పెంచటమేకాకుండా మా సంస్థకు హ్యాట్రిక్‌ హిట్‌ అందించే చిత్రమవుతుందని అన్నారు..