రంగంలోకి భాజపా అధిష్ఠానం

RAM MADHAV
RAM MADHAV

రంగంలోకి భాజపా అధిష్ఠానం

నడుంబిగించిన రామ్‌ మాధవ్‌
26, 27న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో కలసి పర్యటన
రాష్ట్ర అధ్యక్షుడిగా తెరపైకి సోమువీర్రాజు,కన్నా పేర్లు
పార్టీ విస్తృతస్థాయి సమావేశం
కేంద్ర పథకాలతో ప్రజల్లో రాష్ట్ర బిజెపి నేతలు
తెదేపాపై ఎదురు దాడికి సన్నాహాలు

అమరావతి: కేంద్రంతోను, ఎన్డీఎతో టిడిపి బిజేపితో పొత్తు తెగదెంపులతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు,జాతీయస్థాయిలో చోటుచేసుకున్న రాజకీయ సమీక రణల్లో మార్పులతో రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దడానికి కేంద్ర బిజేపి అధి ష్టానమే రంగలోకి దిగింది.ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ ఇంచార్జీగా కొనసా గిన సిద్ధార్ధ్‌ను తప్పించి ఆపార్టీ జా తీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌కు రాష్ట్ర ఇంచార్జీగా నియా మకం చేశారు.ఆయన కేంద్ర జల వనరుల,రవాణా ఉపరితల శాఖల మంత్రితో కలసి ఈనెల 26,27 తేదీల్లో రాష్ట్ర రాజధాని జిల్లాల్లో పర్యటించి పార్టీనేతలు,సీనియర్‌ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు నాలుగేళ్ళుగా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతుండడం ఆయ నను మార్పుచేయనున్నట్లు తెలిసింది.ఏపి నుంచి కేంద్రమంత్రివర్గంలో మొన్నటి వరకు టిడిపికి చెందిన ఇరువురు మంత్రులు కొనసాగడం వారు రాజీనామాతో రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిం చేం దుకు ఒక్కరు కూడా మంత్రిలేని కారణంగా హరిబాబుకు ఆ కేంద్ర మంత్రి పదవి లభిస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపధ్యంలో రాష్ట్ర బిజేపి అధ్యక్షుడి రేసులో ఎమ్మెల్సీ సోమువీర్రాజు, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణలున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ల,కమ్మ సామాజిక వర్గాలకు చెందిన అధినేతల సారధ్యంలో రాజకీయపార్టీలు కొనసాగు తున్నాయి.రాష్ట్రంలో ఆ సామాజికవర్గాల తర్వాత కాపులే అధికంగా ఉండడంతో ఆవర్గానికి చెందిన సోమువీర్రాజు,కన్నా లక్ష్మీనా రాయణల పేర్లు అధిష్టానంలో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.సోము వీర్రాజు అధ్యక్షపదవి కోసం కొన్నేళ్ళుగా ఆశలు పెట్టుకొని ఉన్నారు.