రంగంలోకి దిగిన మెగాస్టార్‌!

CHIRANJEEEVi
Mega Star Chiranjeevi

రంగంలోకి దిగిన మెగాస్టార్‌!

చిరంజీవి 150వ చిత్రంగా ఖైదీ నెంబర్‌ 150 చకచకా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ముందుగానే చెప్పేశారు. అందువలన ఆ సమయానికి అన్నిపనులు పూర్తయ్యేలా చూసుకోవలసిందే. ఈ కారణంగానే ఈ సినిమాలో ఇంతవరకూ తాను చేసిన సీన్స్‌ కి డబ్బింగ్‌ చెప్పుకోవడానికి చిరంజీవి రంగంలోకి దిగారు. నిన్నటి నుంచే ఆయన తన పాత్రకి డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో వెరైటీగా ప్లాన్‌ చేసే పనిలో చరణ్‌ వున్నాడు. ఈ సినిమాకి గల ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని వినాయక్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాజల్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.