య‌స్ బ్యాంకులో 2,500 మంది ఉద్యోగాలు తొలగింపు!

YES BANK
YES BANK

ముంబాయిః హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బాటలోనే ఇప్పుడు యస్‌ బ్యాంకు కూడా పయనిస్తోంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న
2,500మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యస్‌ బ్యాంకు వెల్లడించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 10శాతం కన్నా ఎక్కువ
కావడం గమనార్హం. నూతన సాంకేతిక విధానం ముఖ్యంగా డిజిటలైజేషన్‌ నేపథ్యంలో పేలవమైన పనితీరు కనబరిచిన
ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బ్యాంకులో మొత్తం 21వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మార్చి 2017తో ముగిసిన త్రైమాసికాలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 11వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.