యోగాసనాలు

                            యోగాసనాలు

YOGASANALU
YOGASANALU

ఏకపాద ఉత్తానాసనం

చేసే విధానం : ముందుగా తివాచీ మీద వెల్లకిల సమస్థితి లో పడుకుని చేతులను తలపైన పెట్టుకొని నెమ్మ దిగా శ్వాస పీలుస్తూ, వదులు తూ , కుడి 90డిగ్రీల లో పైకి లేపి నిలబెట్టాలి. రెండో కాలు లేప కూడదు. ఈస్థితిలో 6,7 సెకన్ల కాలం ఉండి ఆకాలును నెమ్మదిగా దించి ఎడమ కాలుతో కూడా అదే విధంగా చేయాలి. సూచనలు : ఒక కాలు పైకి లేచినప్పుడు రెండో కాలు లేపకుడదు. కాలు లేప్ఞనప్పుడు మోకాలు వంచకూడదు . ఉపయోగాలు : పొట్ట పూర్తిగా తగ్గుతుంది. పొట్టకు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి, గుండెజబ్బు బి,పి, ఉన్నవారు ఈ ఆసనం చేయవద్దు .

ద్విపాద ఉత్తానాసనం :
చేసే విధానం : ముందుగా తివాచీమీద వెల్ల కిల సమస్థితిలో పడుకొని చేతులను తలపైన ఉంచి శ్వాస వదులు తూ,తీసుకుంటూ ,రెండు కాళ్ళను ఒకేసారి 90డిగ్రీల కోణంలో తిన్నగా నిలపాలి.ఈ స్థితిలో 7,8 సెకన్లకాలం ఉన్న తరువాత శ్వాస వదులుతూ, తీనుకుంటూ నెమ్మదిగా రెండు కాళ్లను మోకాళ్ళు వంచకుండా దింపాలి.సూచనలు : రెండు కాళ్ళను ఎత్తేటప్పుడు దించేటప్పుడు మోకాళ్ళు వంచకూడ దు. ఒకేసారి గబాలున కాళ్ళు ఎత్తటం గభాలున కాళ్ళు దించటం చేయకూడదు. మొదలు పెట్టినప్పుడు కొంచెం పొట్టలో నొప్పులు చేసినా 4,5 రోజులకు నెమ్మదిగా నొప్పులు తగ్గుతాయి. ఉపయోగాలు : ఏక పాద ఉత్తానాసనంలోని ఉపయోగాలన్నీ ఈ ఆసనానికి వర్తిస్తాయి.

పవన ముక్తాసనం :
చేసే విధానం : ముందుగా తివాచీ మీద వెల్లకిలా పడుకోవాలి. ఇప్పుడు నెమ్మ దిగా ఊపిరి వదులుతూ కుడికాలుని మడిచి ముక్కు వద్దకు తెస్తూ అదే సమయంలో రెండు చేతు లను కుడికాలు అరికాలును నొక్కి పెట్టాలి, ఇప్పుడు ఊపిరి బిగపట్టి 10,15 సెకనుల కాలం ఉండి నెమ్మదిగా ఊపిరి వదులుతూ యధాస్థితికి రావాలి. ఈ విధంగా 3 లేక 4 సార్లు చేయాలి,ఈ విధంగా ఒక్క కాలుతోను మూడు సార్లు రెండు కాళ్లతోనూ 3 సార్లు చేయాలి.ప్రయోజనాలు : ఈ ఆసనాల వల్ల తొడలకు , ఉదరమునకు మంచి వ్యాయామం జరగటంతోపాటు , పొట్ట పెరగకుండా ఉండి, గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది. అరుగుదల పెరిగి మలబద్ధకం తగ్గుతుంది.

జఠర పరివృత్తాసనం

చేసే విధానం : ముందుగా తివాచీ మీద వెల్లకిల సమస్థితిలో పడుకోవాలి, ఇప్పుడు రెండు చేతులను భుజాలకు తిన్నగా పక్కకు జాపి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కుడికాలును పైకి లేపి శ్వాస వదులుతూ ఎడమ వయిప్ఞ నేలకు ఆనించి. 5,6 సెకన్ల కాలం ఉండి శ్వాస తీసుకుంటూ యధాస్థితికి వచ్చి తిరిగి ఎడమ కాలితోనూ పై విధంగా చేయాలి.సూచనలు : కాళ్ళు నెమ్మదిగా ఎత్తాలి.ఉపయోగాలు: ఈ ఆసనం వలన పొట్ట తగ్గటం నడుము సన్న బడి చక్కటి ఆకృతి రావటం జరగుతుం ది.మలబద్ధకం తగ్గటం , జీర్ణక్రియ సక్రమంగా ఉండటం జరుగుతుంది.

హలాసనం : ఈ ఆసనము నాగలిని పోలి ఉంటుంది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది.
చేసే విధానం : ముందుగా తివాచీ మీద వెల్లకిల పడుకొని శ్వాస వదులుతూ రెండు కాళ్ళను నెమ్మదిగా లేప్ఞతూ నడుము దగ్గర చేతుల ఆసరాతో కాళ్ళను పూర్తిగా వెనక్కు తీసుకు వెళ్ళాలి. ఈ స్థితిలో 5,6 సెకన్ల కాలం ఉన్నతరువాత శ్వాస వదులుతూ విపరీతికరణి స్థితికి వచ్చి నెమ్మదిగా విరుద్ద పద్ధతిలో యధాస్థితికి రావాలి.సూచనలు : ఈ ఆసనం నెమ్మదిగా గురుముఖంగా సాధన చేయాలి. లేకపోతే భుజాలు,మెడ కండరాలు నొప్పులు చేస్తాయి.ఉపయోగాలు : వెన్నునొప్పి తగ్గటం జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ధైరాయిడ్‌ గ్రంధి ఉత్తేజింపబడటం, జ్ఞాపకశక్తి పెరగటం జరుగుతుంది.