యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా 14 ఏళ్ల మిల్లీ బ్రౌన్‌

millie bobby brown
millie bobby brown

ప్రముఖ అమెరికన్‌ నటి మిల్లీ బాబీ బ్రౌన్‌ తాజాగా యూనిసెష్‌ గుడ్‌విల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. న్యూయార్క్‌లోని యూనిసెఫ్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన వరల్డ్‌ చిల్డ్రన్స్‌డే సందర్బంగా జరిగిన కార్యక్రమంలో 14 ఏళ్ల మిల్లీ బాబీ బ్రౌన్‌ను యంగెస్ట్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్రౌన్‌ మాట్లాడుతూ ఇది యూనిసెఫ్‌ తరఫున తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. యూనిసెఫ్‌ అంబాసిడర్‌ కావాలని తాను కన్న కలలు సాకారమయ్యాయని అన్నారు.