యూదులపై శ్వేతజాతీయుని కాల్పులు

Pittsburgh
Pittsburgh

యూదులపై శ్వేతజాతీయుని కాల్పులు

8మంది మృతి, పలువురికి గాయాలు

పిట్స్‌బర్గ్‌(అమెరికా): సాయుధుడైన దండగుడు జరిపిన కాల్పులో సుమారు ఎనిమిది మృతిచెందారని అమెరికా పోలీసులు ట్విట్టర్‌లో వెల్లడించారు. గెడ్డంతో ఉన్న శ్వేతజాతీయుఏడు ఒకరిని ఈ ఘటనకు సంబంధించి అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. కెడికెఎ టివి ప్రకారం చూస్తే యూదులు అందరూ చనిపోవాలి అని అరుస్తూ లోనికి జొరబడి కాల్పులు జరిపినట్లు చెపుతున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసు అధికారులుకాల్పులుజరిపి ప్రతిఘటిం చారు. ముగ్గురు అధికారులు గాయపడినట్లు టివి కథనం ప్రసారంచేసింది. పెన్సిల్వేనియా గవర్నర్‌ టామ్‌ వోల్ప్‌ మాట్లాడుతూ వెనువెంటనే తక్షణ సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పిట్స్‌బర్గ్‌ మెడికల్‌ కేంద్రంలో క్షతగాత్రులందరికి చికిత్స చేస్తున్నారు. ఈ ఆగంతకుడు జరిపిన కాల్పులవల్ల క్షతగాత్రులు ఎక్కువ మంది ఉన్నా రని, పిట్స్‌బర్గ్‌ పోలీస్‌ కమాండర్‌ వెల్లడించారు. స్థానిక నివాసితులెవ్వరూ బైటికి రావద్దని ముందుగానే హెచ్చరించారు.