యువ ఇంజినీర్ల ఎంపికపై దృష్టిసారించిన మహీంద్రా

MAHINDRA
MAHINDRA

యువఇంజినీర్ల ఎంపికపై దృష్టిసారించిన మహీంద్రా

ముంబై, అక్టోబరు 11: దేశీయ ఆటో దిగ్గజం అయిన మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రాడ్యుయేట్ల నియా మకాలపై దృష్టిసారంచింది. ఇంజినీరింగ్‌, బిజినెస్‌ స్కూళ్ల ద్వారా 2018లో 300మంది గ్రాడ్యు యేట్లను తన కంపెనీలోకి తీసుకోవాలని యోచి స్తోంది. గతేడాది కూడా క్యాంపస్‌ల నుండి ఇంతే మొత్తంలో నియామకాలను చేపట్టింది. వీరిలో ఎక్కువ మంది ఇంజినీర్లనే ఎంపిక చేసుకుంది. డిజై న్స్‌, కొత్త టెక్నాలజీలు, ఎలక్ట్రిక్‌ వాహనాలపై పని చేయడానికి వీరిని నియమించింది.

అన్ని టీమ్‌ల్లో తాము ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ సొల్యూషన్‌ కోసం నియామకాలు చేపడుతున్నామని, కంపెనీ ఎక్కువగా దృష్టిసారించిన ప్రాంతంలో ఇదీ ఒకటని చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రాజేశ్వర్‌ త్రిపాఠి చెప్పారు. ఈ ఏడాది 600మంది నుండి 700మందిని తీసు కోవాలని కంపెనీ భావిస్తోందని, ఈ నియామకాలు ఎక్కువగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌, భర్తీ నియా మకాల ద్వారా ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పటికే మహీంద్రా అండ్‌ మహీంద్రాలో 22వేల మంది స్టాఫ్‌ ఉన్నారని, వారిలో కనీసం 16వేల మంది బ్లూ-కాలర్‌ ఉద్యోగాలేనని అన్నారు. పలు కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్‌ వంటి కొత్త టెక్నాలజీలను చేర్చుతోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రాలో మహిళా ఉద్యోగులు మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 20శాతం మంది ఉన్నారన్నారు. ఈ వైవిధ్యాన్ని మెరుగుపర్చేందుకు తాము కృషిచేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.